సిఎం చంద్రబాబు అటూ కుటుంబం నుంచి వచ్చే ఒత్తిడి..ఇటు బీజేపీ,జనసేన నుంచి వచ్చే ఒత్తిడి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ పార్టీని కంట్రోల్ లో పెట్టుకొని రాజకీయం ఉన్నారు.తిరుమల తొక్కిసలాట ఎఫెక్ట్..సిఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు క్షమాపణలు చెప్పాలి అని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఒత్తిడి చేయడంతో చైర్మన్ బిఆర్ నాయుడు క్షమాపణలు చెప్పారు..అక్కడ నుంచి టిడిపి ఆట మొదలు పెట్టింది..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటు ప్రభుత్వంలో పట్టు పెంచుకోవడం,అధికారులు కూడా వినయం ప్రదర్శించడం..హోమ్ శాఖను టార్గెట్ చేయడం..అధికారులు పలకడం లేదు అంటూ బహిరంగ వ్యాఖ్యలు చేయడంతో టిడిపి ఒక్కసారి ఉలిక్కి పడింది..చేయి దాటిపోతుంది అని గమనించి నష్ట నివారణ చర్యలు చేపట్టారు..
హోంమంత్రి అమిత్ షా షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ కలిసే అపాయింట్ మెంట్ కూడా లేదు.సిఎం చంద్రబాబుతో భేటీ అవ్వడానికి అమిత్ షా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను పిలిపించారు..ఈ మీటింగ్ లో పురందేశ్వరికి అవకాశం ఇవ్వలేదు.టిడిపి మెర ఆలకించిన అమిత్ షా పవన్ కళ్యాణ్ ప్రభుత్వం మీద దూకుడుగా వెళుతున్న అమిత్ షా మందలించలేదు అని సమాచారం..
అమిత్ షా పర్యటనకు ముందు చంద్రబాబు వ్యూహాత్మకంగా నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం చేయాలని తెర పైకి తెచ్చారు.అమిత్ షా చంద్రబాబు భేటీలో రెండవ డిప్యూటీ సిఎం పదవి నారా లోకేష్ కి ఇవ్వడానికి అమిత్ షా ఆసక్తి చూపలేదు..ప్రభుత్వ లోపాలు,టిడిపి కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్న ఇసుక,లిక్కర్,మైనింగ్,మట్టి వ్యాపారాలు చిట్టా నా దగ్గర ఉంది అంటూ అమిత్ షా టీడీపీని హెచ్చరించారు అని మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది.
తిరుమల తొక్కిసలాట ఘటనలో భక్తులు చనిపోయిన దానికి టీటీడీ చైర్మన్ క్షమాపణలు చెప్పాలి అనేది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అభిప్రాయం అంటూ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నారా లోకేష్ మాట్లాడుతూ టీడీపీ పార్టీ అభిప్రాయం టీటీడీ చైర్మన్ క్షమాపణలు చెప్పడం కాదన్నారు. దీని బట్టి పవన్ కళ్యాణ్ Vs నారా లోకేష్ ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమంటుంది అంటూ చర్చలు నడుస్తున్నాయి.
బీజేపీ,జనసేన పార్టీలను దిక్కరించి సిఎం చంద్రబాబు తన కుమారుడిని డిప్యూటీ సిఎం చేసే అవకాశం లేదు.పవన్ కళ్యాణ్ దూకుడుగా వెళ్ళే కొద్ది టిడిపి డిఫెన్స్ లో పడుతుంది.సీఎం చంద్రబాబును డ్యామేజ్ చేస్తూ పట్టు పెంచుకునే యోచనలో పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నారు.
డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ను కంట్రోల్ చేయాలి అని హోంమంత్రి అమిత్ షాకు టిడిపి మెర పెట్టుకోవడం వలన పవన్ కళ్యాణ్ దూకుడు తగ్గిస్తారా!మరింత రెచ్చిపోతారా అనేది వేచి చూడాలి
చంద్రబాబు కుటుంబ ఒత్తిడి అధిగమించి ఒక్కరూ మాత్రమే డిప్యూటీ సిఎం మాత్రమే ఉండాలని స్టేట్మెంట్ ఇస్తే..నారా లోకేష్ కు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఆగిపోవడం అనేది టిడిపి కార్యకర్తలు ఆవేదన,ఆక్రోశం,ఉక్రోషం వ్యక్తం చేస్తున్నారు.
నోట్:
టిడిపి కూటమిలో టిడిపి 134సీట్లు గెలవడం కేవలం పవన్ కల్యాణ్ భిక్ష అంటూ జన సేన సోషల్ మీడియా టీడీపీని టార్గెట్ చేస్తుంది.రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గెలిపించేది ఎంటి అంటూ టిడిపి కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు.40ఏళ్ల టీడీపీని పవన్ కళ్యాణ్ గెలిపించాడు అని జన సేన చేసే ప్రచారం టీడీపీకి బాగా డ్యామేజ్ అవుతుంది.పార్టీ ప్రజలలో పలుచన అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
టిడిపి సొంతంగా గెలిస్తే గెలవాలి కానీ ఎవరి మీదో ఆధారపడి గెలవడం వలన ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ భాగస్వామి అవ్వడం, పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరగడంతో టిడిపి నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది..