---Advertisement---

భారతమ్మ ఔదార్యం… షర్మిళ విలనిజం

Bharatamma's Generosity... Sharmila's Villainy
---Advertisement---

పెట్టిన చేతినే కాటేస్తారా ?

భారతమ్మ ఔదార్యం కనబడలేదా

షర్మిళ నిజరూపం ఇదా ??

ఎక్కడైనా నడిచే ఎద్దునే మరింతగా కొడతారు.. కాయలు కాస్తున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి. మనుషుల్లోనూ కృతజ్ఞత కనుమరుగైపోతోంది. ఎప్పుడైనా ఆపదలో ఉన్నపుడు సాయం చేస్తే తిరిగి వాళ్లనే కాటేస్తున్నారు.. అన్నం పెట్టిన చేతికి గాయం చేస్తున్నారు. ఆ మానవ నైజానికి షర్మిళ ఏమాత్రం మినహాయింపు లేదు.. ఆవిడ కూడా అచ్చం సగటు మనిషిలానే వ్యవహరిస్తున్నారు తప్ప తనకు ఎవరు ఎంతమేలు చేశారన్నది గుర్తుంచుకోవడం లేదు.

వాస్తవానికి షర్మిలకు ఏనాడో పెళ్ళైపోగా ఆమెకు తండ్రి దివంగత వైయస్సార్ అప్పట్లోనే ఆస్తులు రాసిచ్చేశారు. కొడుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డితోబాటు షర్మిలకు వాటాలు ఇచ్చేసారు. అంతేకాకుండా గత ఇరవయ్యేళ్లలో జగన్, అయన సతీమణి భారతి కూడా అప్పుడప్పుడూ డబ్బు సాయం చేస్తూ వచ్చారు. ఇదంతా కలిపి గత ఇరవయ్యేళ్లలో దాదాపు రూ. 200 కోట్లవరకూ ఉంటుందని అంచనా.. వాస్తవానికి ఆడబిడ్డకు పెళ్ళై, వేరుకాపురం పెట్టుకున్నాక ఏ కోడలు కూడా అంత భారీగా సాయం చేసేందుకు అంగీకరించరు. ఏనాడో పెళ్ళైపోయి వేరుపడిన ఆడబిడ్డకు కోట్లకు కోట్లు ఇవ్వడానికి ఏ కోడలూ ఒప్పుకోదు కానీ భారతమ్మ మాత్రం షర్మిళకు ఉదారంగా సాయం చేస్తూనే ఉన్నారు. తన భర్త జగన్ తో కూడా సాయం చేయించారు.

ఎంత లేదనుకున్నా మన ఇంటి ఆడబిడ్డ మనం కాకుంటే ఇంకెవరు చూస్తారు అనే మంచిమనసుతో భారతమ్మ షర్మిలను ఆర్థికంగా ఆదుకుంటూనే ఉన్నారు. అంతేకాకుండా కోర్టు కేసులు, ఈడీ ఎటాచ్మెంట్లలో ఉన్న అస్తుల్లోనూ షర్మిలకు భాగం ఇవ్వాలని భారతి భావించారు. ఆ కేసులు పూర్తయి, ఒక కొలిక్కి వచ్చాక అందులో కూడా షర్మిలకు వాటా ఇవ్వాలని భావించారు. కానీ షర్మిళ దూకుడుగా వెళ్లి మొత్తం వ్యవహారాన్ని విడదాస్పదం చేయడమే కాకుండా కేసులు మరింత జఠిలమయ్యేలా వ్యవహరించారు. ఈడీ ఎటాచ్మెంట్లో ఉన్న ఆస్తులను తనపేరిట బదలాయించుకుని తన అన్న జగన్ మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టాలన్నట్లుగా షర్మిల వ్యవహరించారు. ఆమెకు మంచి చేయాలనీ అన్నావదిన భావిస్తే వాళ్లకు చెడు చేయాలన్నది షర్మిళ ఆలోచనగా కనిపిస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment