---Advertisement---

ఇంగ్లీష్ పత్రికల్లో కూటమి భజన: ఏపీ ప్రజల పన్నుల సొమ్ము ఎలా వాడుతున్నారు?

Coalition’s Media Spending: How Andhra Pradesh Taxpayer Money is Being Used
---Advertisement---

ఏపీ ప్రభుత్వం ఇంగ్లీష్ పత్రికల్లో యాడ్స్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. ఈ ఖర్చు ఎలా జరుగుతుందో చూస్తే, అది ప్రజల పన్నుల సొమ్ముతోనే అని స్పష్టమవుతోంది. ప్రజలకు ఉపయోగపడే పనులకు ఖర్చు పెట్టకుండా, కేవలం ఇంగ్లీష్ పత్రికల్లో భజన చేయించుకోవడమే దీని ఉద్దేశమా?

జనం సొమ్మును ప్రజల కోసం వాడితే, ఎన్ని మంచి పనులు చేయొచ్చు. ఉదాహరణకు, ఆ డబ్బుతో 10 వేల మంది మహిళలకు గ్యాస్ సిలిండర్ ఉచితంగా అందించవచ్చు. లేకపోతే, కనీసం లక్ష మంది మహిళలకు ₹1,800 చొప్పున ఆర్థిక సహాయం అందించవచ్చు. తల్లికి వందనం పథకం కింద ఒక్కొక్క తల్లికి ₹2,000 అయినా ఇవ్వొచ్చు. కానీ, ఈ కూటమి ప్రభుత్వం ఇలా ఏమీ చేయకుండా, ఆ డబ్బును నార్త్ ఇండియాకు చెందిన పత్రికలకు యాడ్స్ రూపంలో ఇస్తోంది.

ప్రజలకు నిజాలు తెలిస్తాయని భయపడి, తెలుగులో కాకుండా ఇంగ్లీష్ పత్రికల్లోనే యాడ్స్ ఇస్తున్నారు. ఇలాంటి వ్యయాలు ప్రజలందరికీ వివరిస్తే, అసలైన తీరు ఏమిటో బహిరంగంగా తెలుస్తుంది.

ఇప్పటికి చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలలో అసంతృప్తి పెరుగుతోంది. జగన్ ప్రభుత్వం ప్రజల సొమ్ము ప్రజలకే అందజేసినప్పుడు, ఇదే కూటమి నేతలు విమర్శలు చేశారు. ఇప్పుడు, ఆ కూటమి ప్రభుత్వమే ప్రజల సొమ్మును నార్త్ ఇండియా పత్రికలకూ, పరాయి భాష పత్రికలకూ ఎందుకు ఇస్తోంది?

ఇది న్యాయమా? ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు? ఏపీ ప్రజలు ఇలా అడుగుతున్నారు. జస్ట్ ఆస్కింగ్!

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment