2 సంవత్సరాల క్రితం, మా అమ్మకి కార్ ఆక్సిడెంట్ జరిగినప్పుడు, నేను ఇప్పుడు కార్ ఆక్సిడెంట్ చేయించానని టీడీపీ అఫీషియల్ పేజీలో పోస్టు పెట్టారు. మా అమ్మ విజయమ్మ అటువంటి పోస్టును ఖండిస్తూ లేఖ రాస్తే, దాన్ని పేక్ అని మళ్లీ టీడీపీ అఫీషియల్ పేజీలో పెట్టారు.
తర్వాత మా అమ్మ ఆ కార్ ఆక్సిడెంట్‌కి నా కొడుక్కు సంబంధం లేదని, మరీ ఇంత నీచంగా ప్రచారం చేస్తారా అని వీడియో విడుదల చేశారు.
ఇప్పుడు, ఇంత నీచమైన ప్రచారం చేస్తున్న లోకేష్ ను అరెస్ట్ చేయలారా?
నా భార్య కడప SPకి ఫోన్ చేసి అని ఆంధ్రజ్యోతి రాసింది. అది అబద్దం అని ప్రచారం చేసిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను అరెస్ట్ చేస్తారా?
ఇక, “మద్యం వద్దు, విద్య ముద్దు” అంటూ వైసీపీ వాళ్ళు పోస్ట్ చేసినప్పుడు అరెస్ట్ చేసారు.
7 సంవత్సరాలు లోపు శిక్ష పడే కేసుల్లో, ముందుగా 41A నోటీసు ఇచ్చి, అరెస్ట్ అవసరమైతే కోర్ట్ అనుమతితో చేయాలి అని సుప్రీం కోర్ట్ నిబంధనలు ఉన్నాయి. కానీ ఈ నిబంధనలను పట్టించుకోకుండా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు.
టీడీపీ ఎల్లప్పుడూ అధికారం లో ఉండదు. అన్యాయంగా అరెస్ట్ చేసే పోలీసు అధికారులపై ప్రైవేట్ కేసులు పెట్టాల్సి ఉంటుంది. ఎక్కడ దాక్కున్నా, మా ప్రభుత్వం రాగానే చర్యలు తీసుకుంటాం