మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాపై సీఎం, మంత్రులు లోకేశ్,’అనగాని’కి తహసీల్దార్ ఖాజాబీ స్వయంగా ఫిర్యాదు.
మాఎమ్మెల్యే నన్ను పనిచేసుకోనివ్వట్లేదు. ప్రతినెలా రూ.30 లక్షలు కప్పం కట్టమంటున్నారు. ఆయన పురమాయించిన పనులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ చేసి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఆయన అక్రమాలకు సహకరించకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. నేను అవినీతిపరురాలినని.. పార్టీ అనుకూల పత్రికల్లో వార్తలు రాయించి వేధింపులకు గురిచేస్తున్నారు’.. అంటూ అన్నమయ్య జిల్లా మదనపల్లె తహసీల్దార్ ఖాజాబీ ఏకంగా సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను స్వయంగా కలిసి చెప్పుకున్న గోడు ఇది.