వాయనాడ్‌లో పోలింగ్ ముగింపు: ఓటింగ్ శాతం భారీగా తగ్గుదల
కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ శాతం గణనీయంగా తగ్గింది. ఇవాళ సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి వాయనాడ్‌లో 60.79 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.
క్యూలైన్లలో ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఈ శాతం కొంచెం పెరిగే అవకాశమున్నప్పటికీ, 65 శాతం దాటడం అనుమానంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.
గతంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో వాయనాడ్‌లో 79.77 శాతం పోలింగ్ నమోదైంది. అయితే 2024లో ఇది 72.69 శాతానికి పడిపోగా, తాజా ఉప ఎన్నికల్లో మరింత తగ్గడం గమనార్హం.