వైయస్ జగన్ పులివెందుల పర్యటన
మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ రేపు (29.10.2024) వైఎస్సార్ జిల్లాలోని పులివెందులలో పర్యటించనున్నారు.
ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి, 10.45 గంటల ప్రాంతంలో ఇడుపులపాయకు చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు, అక్కడ మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటారు.
ఈ పర్యటన సందర్భంగా ఆయన పలు కార్యక్రమాలకు హాజరుకాబోతున్నారు, తద్వారా స్థానిక ప్రజలతో ప్రత్యక్షంగా సంప్రదింపులు జరపాలని ఆశిస్తున్నారు.
ఇటీవల వైయస్ షర్మిల ఆస్తుల విషయంలో ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనితో, పులివెందుల పర్యటనలో వైయస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్లు జగన్ సన్నిహితుల ద్వారా సమాచారం అందింది. ఈ పర్యటన రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఏం జరుగుతుందో మనం వేచి చూడాల్సిందే!